అఖిల్ నాలుగో సినిమా పై భారీ ఆశలు…

చిన్న తాణంలోనే క్యామెరా ముందుకు వచ్చిన యాంగ్ హీరో అక్కినేని అఖిల్. హలో సినిమా తరువాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే విషయామ్ మన అందరికి తెల్సిందే . ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అక్కినేని అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాద్ – ఫిల్మ్ నగర్లోని ‘దైవసన్నిధానం’లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున – అమలతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యేలోగా హీరోయిన్ ను ఎంపిక చేస్తామని దర్శకుడు చెప్పారు . అఖిల్ నటించిన మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. అందువలన వాళ్లంతా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.

Leave a Response