చంద్రబాబుపై రాంగోపాల్ వర్మ ?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ..ట్వీట్ చేశాడు. చంద్రబాబును పోలిన వ్యక్తి హోటల్ లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేస్తూ..ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఇదీ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం సరిపోయే వ్యక్తి దొరికాడని..వర్మ గతంలో షేర్ చేసిన వీడియోనే తాజాగా మరోసారి ట్వీట్ చేసి బాబుపై సెటైర్లు వేశాడు. సైకిల్ టైర్ పంక్చర్ అయిందని.. పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారని వర్మ ట్వీట్ చేశారు

Leave a Response