భారీ కటౌట్‌.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ లో భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్ సినిమాల తర్వాత మిల్క్ బాయ్ నటిస్తోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారన్న విషయానికి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద దర్శనమిస్తున్న మహేశ్ బాబు భారీ కటౌటే నిదర్శనం. 81 అడుగుల భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటుచేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెల‌ల సమయం ఉంది. అప్పుడే అభిమానుల హడావుడి మొదలైంది. ఈ సినిమాలో ర‌ష్మిక మందన మహేశ్ సరసన నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చిన విషయం మన సంగతి అందరికి తెలిసిందే.

Leave a Response