చర్చ‌లు జ‌రుపుతున్న జ‌క్క‌న్న‌….

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాలో హీరోలుగా న‌టిస్తుండ‌గా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బ్రిటిష్ బ్యూటీ ఓలివియా మోరిస్‌, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రూ.400 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సినిమాను ప‌ది భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. అందుక‌ని సినిమాను భారీ రేంజ్‌లో విడుద‌ల చేయ‌డానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో రాజ‌మౌళి చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ని టాక్‌. 1920 బ్యాక్‌డ్రాప్‌లో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథ ఆధారంగా ఆర్ఆర్ఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Leave a Response