నేనా పార్టీలో లేను గానీ..!: ప్రకాశ్‌రాజ్‌

అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీలో తాను లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ సిద్ధాంతాలు మాత్రం తనకు బాగా నచ్చాయని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. దేశంలో ఏ పార్టీ అయినా పాలించడానికి కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దేశంలో రెండు జాతీయ పార్టీల పరిస్థితీ బాగాలేదన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని.. ఆయనో నటుడిగా మారారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు. భాజపా సరైన దారిలో వెళ్లట్లేదు గనకే తాను ఆ పార్టీని విమర్శిస్తున్నానని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారు.

Leave a Response