చెర్రీ చిన్ననాటి జ్ఞాపకాలపై ఉపాసన ట్వీట్‌!

చిన్ననాటి జ్ఞాపకాలు ఎలాంటి వారికైనా మధురానుభూతిని మిగులుస్తుంటాయి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల రోజుల్లో స్నేహితులతో కలిసి చేసే  సందడి, వారితో గడిపిన క్షణాలు కళ్లెదుటే కదలాడతాయి. దీనికి ప్రముఖులూ అతీతులేమీ కారు. ప్రముఖ నటుడు రాంచరణ్‌ ఇటీవల తమిళనాడు వెళ్లి చిన్నప్పుడు తాను చదువుకున్న లారెన్స్‌ స్కూల్‌ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. స్కూల్‌ క్యాంటీన్‌, డార్మెటరీ, తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించిన చెర్రీ.. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు.

Leave a Response