మళ్లీ తమిళంలోకి శర్వానంద్‌

తెలుగులో అగ్ర హీరోల వరుసలో చేరిన శర్వానంద్‌ యువతలో గుర్తింపు తెచ్చుకునే సినిమాలతో అలరిస్తున్నారు. అక్కడ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘కాదల్‌నా సుమ్మా ఇల్లై’, ‘ఎంగేయుం ఎప్పోదుం’ వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘96’ రీమేక్‌, మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడి చిత్రంలో శర్వానంద్‌ నటిస్తున్నారు. త్వరలోనే సినిమా పేరు, ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నట్లు ప్రభు చెప్పారు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ ప్రభు తన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానరుపై సూర్య హీరోగా ‘ఎన్‌జీకే’, కార్తి హీరోగా ‘ఖైదీ’, జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ సినిమా, శిబిరాజ్‌, ఆండ్రియా జంటగా నటిస్తున్న మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటిలో ఎన్‌జీకే త్వరలోనే తెరపైకి రానుంది.

Leave a Response