అనారోగ్యంతో ఉన్నా..బయటికిరాలేను

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రతి ఆదివారం తన నివాసం వద్ద అభిమానుల్ని కలుస్తుంటారు. గత 36 ఏళ్లుగా జుహూలోని తన నివాసం వద్ద ఆయన అభిమానుల్ని కలుస్తున్నారు. అయితే  కలవలేకపోతున్నట్లు బిగ్‌బి ఫ్యాన్స్‌కు తెలిపారు. కాస్త అనారోగ్యానికి గురైన కారణంగా ‘సండే దర్శన్’ను రద్దు చేసినట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఇవాళ ‘సండే దర్శన్‌’కు రావడం లేదు. అనారోగ్యంతో బెడ్‌పైన ఉన్నాను, నొప్పితో బాధపడుతున్నాను. అందరికీ చెప్పండి. భయపడాల్సింది ఏమీ లేదు. కానీ బయటికి రాలేకపోతున్నా’ అని ఆయన బ్లాగ్‌లో రాశారు.అమితాబ్‌ ఇటీవల ‘బద్లా’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు తెలిసింది.

Leave a Response