ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్….

‘ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్?’ అంటూ ప్రశ్నిస్తున్నవారికి నా సమాధానం ఇదేనంటూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ. తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. పెళ్లి గురించి ప్రశ్నలు అడిగేవారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈరోజు మీ అందరితో నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పనిచేస్తున్న ప్రదేశంలో నా మంచి కోరి నన్ను ఓ విషయం అడుగుతూ ఉంటారు. ‘అనసూయ.. చాలా తొందరగా పెళ్లి చేసుకున్నావ్‌. లేకపోతే టాప్‌ హీరోయిన్‌ అయిపోయేదానివి. ఎందుకు ఊరికే కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేస్తావ్‌? ఇలా చేస్తే నీకు డిమాండ్‌ తగ్గిపోతుంది’ అని చెబుతూ ఉంటారు. వీరిందరికీ నేను ఇచ్చే సమాధానం ఏంటంటే.. నేను జీవితంలో పొందిన వాటిని చూసి సిగ్గుపడటం లేదు. గర్వపడుతున్నాను. నేను సాధించినవాటిని అందరికీ చూపించాలనుకుంటున్నాను నేను పొందిన వాటిలో అన్నింటికంటే గొప్పది నా కుటుంబం. మనం రాత్రింబవళ్లు పనిచేసేది ఇంటికెళ్లాక కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికే కదా..? నేను పనిచేస్తున్న ప్రదేశంలో మగవారికి లేని హద్దులు ఆడవారికెందుకు? నాలాగే ఆలోచించేవారితో కలిసి పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకో మీతో ఈ విషయం పంచుకోవాలనిపించింది’ అని పేర్కొన్నారు.

Leave a Response