ఎన్టీఆర్ స్పీడుగా డ్రైవ్‌ చేస్తాడు అంటూన పూరి …..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇప్పుడు `ఇస్మార్ట్ శంక‌ర్` స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ `టెంప‌ర్` గురించి ప్ర‌స్తావించారు. అందులో క్యారెక్ట‌ర్‌ను ఎన్టీఆర్‌తో చేయించ‌డం ఆనందంగా అనిపించింద‌ని చెప్పిన ఆయ‌న మాట్లాడుతూ ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ.. “టెంప‌ర్` సినిమాను ఎక్కువ భాగం గోవాలోనే చిత్రీక‌రించాం. ఆ స‌మ‌యంలో కారులో తార‌క్‌తో జ‌ర్నీని మ‌ర‌చిపోలేను. త‌న‌తో రోజూ షూటింగ్‌కు వెళ్లేవాడిని. త‌ను కారును తోలకుండా ఉండుంటే బావుంటుందిరా అనేంత స్పీడుగా డ్రైవ్‌ చేస్తాడు’’ అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు పూరి జ‌గ‌న్నాథ్‌.

Leave a Response