‘డియర్ కామ్రేడ్’ మూవీలో శ్రీదేవి కూతురు..?

నువ్విలా సినిమాతో సినీ రంగానికి పరిచయం అయ్యాడు విజయ్.ఆ తరువాత లైఫ్ ఐస్ బ్యూటిఫుల్,ఎవడే సుబ్రహ్మణ్యం,ద్వారకా,పెళ్లి చూపులు తో సూపర్ హిట్ సొతం చేసుకున్నాడు మన హీరో.ఆ తరువాత ప్రేక్షకులకు సుపరిచితగా మరిన సినిమా అర్జున్ రెడ్డి,గీత గోవిందం అలా చాలా సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు విజయ్ దేవరకొండ.ఇప్పుడు మరో సెన్సషనల్ మూవీ తో మన అందరి ముందుకు వచ్చేశాడు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రూపొందిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాను విడుదలకు ముందే చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తనకీ చిత్రం బాగా నచ్చేసిందని చెప్పాడు. అంతేకాదు, దీనిని హిందీలో రీమేక్ చేస్తానంటూ హక్కుల్ని కూడా భారీ రేటుకి తీసుకున్నాడు. అలాగే, ఈ చిత్రం రీమేక్ ద్వారా విజయ్ దేవరకొండని ఆయన హిందీకి పరిచయం చేయాలనుకున్నాడు. అయితే, తనకిప్పుడే హిందీలో నటించే ఆలోచన లేదంటూ ఆ ఆఫర్ ని విజయ్ సున్నితంగా తిరస్కరించాడు. దీంతో, ఆమధ్య తాను నిర్మించిన ‘దఢక్’ చిత్రంలో నటించిన ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ (శ్రీదేవి తనయ) జంటను కరణ్ ఈ రీమేక్ కు ఎంచుకున్నట్టు తాజా సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి.                                               

                       

Tags:dear kamredujahanavi kapoorrasimika mandhanavijaya devarakonda

Leave a Response