విజ‌య్ చిత్రం రీమేక్ కానుంది…..

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ద‌క్షిణాదిన స‌త్తా చాట‌డానికి సిద్ధ‌మ‌య్యారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జూలై 26న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. డియర్ కామ్రేడ్ సినిమాని నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు భరత్ కమ్మ, హీరో విజయ్‌తో కలిసి ఆయన చూశారు. సినిమా తనను ఎంతో ఆకట్టుకుందని, కదిలించిందని ఆయన పేర్కొన్నారు.డియర్ కామ్రేడ్ సినిమాని మొట్టమొదటగా నేను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప ప్రేమ కథ. విజయ్ దేవరకొండ, రష్మికలు అద్భుతంగా నటించారు. ఈ సినిమా మిమ్మల్ని కదిలిస్తుంది. అంతేకాక.. ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకర్ మంచి మ్యూజిక్‌ని అందించారు. ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రీమేక్ చేస్తుందని తెలిపేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని కరణ్ జోహార్ పోస్ట్ చేశారు. 

Leave a Response