బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తోన్నచిత్రం ‘వెంకీమామ’. ఈ సినేమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందు రానుంది. కానీ అదే రోజు వెంకటేశ్ పుట్టినరోజు కావడం విశేషం.ఈ సినిమాకు డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ జోడీగా రాశీ ఖన్నా నటించారు. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా విడుదల విషయంలో చాలా సందిగ్ధత నెలకొంది. సంక్రాంతికి ఈ మూవీని తీసుకురావాలా లేక డిసెంబర్లోనే విడుదల చెయ్యాలా అనే విషయంలో నిర్మాతలు ఉన్నారు. ఐదారు రోజుల క్రితం క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల అని ప్రచారం జరిగింది. ఇవాళ డిసెంబర్ 13నే వస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. మరో పది రోజుల సమయమే ఉండటంతో ఈ లోపుగా విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. మేనమామ మేనల్లుళ్లయిన వెంకీ, చైతూ కలిసి నటించడమే ఈ సినిమాకి ప్రేక్షకుల్ని రప్పిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ప్రచార కార్యక్రమాలకు తగినంత సమయం లేకున్నా విడుదలకు సిద్ధపడుతున్నారు. సినిమాని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనే విషయంలో పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించే సురేశ్‌బాబు ఈ సినిమాని డిసెంబర్ 13న రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు.
- /
- /admin
- /No Comment
- /15 views
- /naga chaitanyaPayal RajputRashi KhannaVenkateshVenky Mama
13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘వెంకీమామ’…
previous article
కేసీఆర్ తో పోల్చితే జగన్ వేగం…
next article
తమన్ కు ఎస్పీబీ వార్నింగ్…
Related Posts
- /
- /No Comment
రాశి పుట్టినరోజు స్పెషల్ వీడియో…
- /
- /No Comment