టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి. ఈయన దర్శకత్వంలో భారీ చారిత్రక చిత్రంగా ‘ఆర్ ఆర్ ఆర్’ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్నారు. ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ కనిపించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ను ఆరాధించే ఒక గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది. ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే నిత్యామీనన్ కి బదులుగా సాయిపల్లవిని తీసుకోనున్నారా? లేదంటే మరో పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
- /
- /admin
- /No Comment
- /242 views
- /Nithya Menenntrrajamauliram charanRRRsai pallavi
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సాయి పల్లవి..
previous article
రామ్ చరణ్ ఫొటో తీస్తున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది…