రామ్ చరణ్ ఫొటో తీస్తున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది…

టాలీవుడ్ యాంగ్ హీరో ఇప్పుడు సౌతాఫ్రికా అడవుల్లో పర్యటిస్తున్న రామ్ చరణ్, ఓ చిరుతపులిని తన కెమెరాలో బంధిస్తున్న వేళ, ఆ దృశ్యాన్ని ఫొటో తీసిన ఉపాసన దాన్ని అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు తమ మ్యారేజ్ డేను జరుపుకునేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. వారి పెళ్లిరోజు జూన్ 14 అయితే, ఇప్పుడే వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? జూన్ 14 వచ్చేసరికి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ లో చరణ్ బిజీ అయిపోతారట. అందువల్లే ముందుగానే పెళ్లిరోజును జరుపుకుంటోందీ జంట.

ఇక తమ పర్యటనపై ఉపాసన సోషల్ మీడియాలో స్పందిస్తూ, “అడ్వాన్స్‌ గా మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. డైవింగ్, అడ్వెంచర్‌ స్పోర్ట్, హీలింగ్‌ టెక్నిక్స్‌.. ఇలా ప్రతి పెళ్లి రోజునా ఏవో కొత్త విషయాలను ఇద్దరమూ నేర్చుకుంటూనే ఉంటుంటాం” అని వ్యాఖ్యానించారు. ఈసారి సౌతాఫ్రికాలో వన్యప్రాణుల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. వారంరోజుల పాటు హాలిడే ట్రిప్ వేసుకున్నామని, టాంజానియా, మౌంట్‌ కిలిమంజారో వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నామని చెప్పిన ఉపాసన, చరణ్‌ కాలికి అయిన గాయం కారణంగా ఎక్కువగా నడవడానికి కుదరట్లేదని, అయినా, ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. కాగా, వీరిద్దరికీ వివాహమై జూన్ 14 నాటికి ఏడేళ్లు.

Leave a Response