కృష్ణ పుట్టినరోజు… మహేశ్ 26వ చిత్రం టైటిల్

టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈరోజు ఆయన పుట్టిన రోజు. తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకుని, టాలీవుడ్ ప్రిన్స్ గా దూసుకెళుతున్న మహేశ్ బాబు, తన తాజా చిత్రం ‘మహర్షి’తో మరో హిట్ ను అందుకుని, అదే ఊపుతో తన 26వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. నేడు కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ 26వ చిత్రం టైటిల్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అని పేరును పెట్టినట్టు టీజర్ లో కృష్ణ స్వయంగా చెప్పారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అవుతుందని అన్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక టీజర్ ను తయారు చేసిన విధానం ఆకర్షిస్తోంది. మహేశ్ హీరోగా తెరంగేట్రం చేసిన ‘రాజకుమారుడు’ నుంచి 25వ చిత్రం ‘మహర్షి’ వరకూ అన్ని సినిమా పేర్లనూ చూపుతూ చివర్లో టైటిల్ ను రివీల్ చేశారు.

Leave a Response