టాలీవుడ్ యాంగ్ హీరో రామ్ ‘రెడ్’ సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇక కొంతకాలం క్రితం తమిళంలో హిట్ కొట్టిన ‘తాడమ్’ చిత్రానికి ఇది రీమేక్ అన్న విషయం మన అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలు చేసారు దర్శకుడు. ఇది లాంగ్ షెడ్యూల్ అనీ .. నాన్ స్టాప్ గా షూటింగ్ సాగుతుందని చెబుతున్నారు సినిమా యూనిట్. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ రెండు పాత్రల్లోనూ ఆయన డిఫరెంట్ లుక్స్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడట. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తరువాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మారి.
previous article
జబర్దస్త్ కి గుడ్ బాయ్…
next article
పాత కాలం సినిమాలో ప్రభాస్..