గ్రామీణ నేపథ్యంలో ‘తోలుబొమ్మలాట’ రూపొందుతోంది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా, విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. రక్తసంబంధాలు, ఆర్ధిక సంబంధాలుగా మారిపోయే నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయం ఈ మోషన్ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మధ్య వయస్కుడిగా రాజేంద్రప్రసాద్ లుక్ అదిరింది. ఆయన ఈ సినిమాలో ‘సోడాల్రాజు’ అనే పాత్రలో కనిపించనున్నారు. దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, విశ్వంత్, హర్షిత, కల్పన, ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వీలునామాకి సంబంధించి వినిపించే మాటలతో ఈ మోషన్ పోస్టర్ ను వదిలిన తీరు చాలా విభిన్నగా ఉంది.