టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి… అందరికీ సుపరిచితురాలే అన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మధ్య పెద్దగా సినిమాలు తీయకపోయినా… ఫ్యామిలి పిక్చర్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. అయితే, రాశి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు పవన్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. గోకులంలో సీత సినిమాలో పవన్, రాశి కలిసి నటించారు. అప్పుడే పవన్‌కు రాశికి పరిచయం ఏర్పడిందట. అయితే, ఆ చనువుతో పవన్‌ను కలిసేందుకు ఓరోజు రాశి పవన్ షూటింగ్‌లో ఉన్న స్పాట్‌కు వెళ్లానని, కానీ అక్కడున్న జనం, సెక్యూరిటీ చూసి నేను దూరంలోనే ఆగిపోయాను. పవన్ కలుస్తారో లేదో అనుకన్నా… కానీ నేను వచ్చానన్న విషయం తెలియగానే పవన్ స్వయంగా వచ్చి రిసివ్ చేసుకున్నారు అంటూ గుర్తు చేసుకుంది రాశి. ఇంతకీ రాశికి పవన్‌తో పనేంటీ అనుకుంటున్నారా… రాశి తన కూతురు మొదటి బర్త్‌డే ఫంక్షన్‌కు పిలవడానికి స్వయంగా వెళ్లిందట. ఇలా కో స్టార్స్‌కు రెస్పెక్ట్ ఇవ్వటంలో పవన్ కళ్యాణ్ తీరు ముచ్చటేస్తుంది అని ఈ అమ్మడు చెప్పింది.
