ఉచిత చికిత్స చేయిస్తున్న బాల్లయ్య…

బోన్‌ క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఓ బాధితురాలిని టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు కొన్ని కానుకలు అందజేశారు. ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు మన బాల్లయ్య. నటుడు బాలకృష్ణ స్వయంగా వచ్చి పలకరించడంతో ఆ అమ్మాయికి జీవితంపై కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్ధిని స్వప్న కొంత కాలంగా బోన్‌ క్యాన్సర్‌ తో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ… స్వప్నకు ఉచిత చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం హైదరాబాద్‌ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్‌ హాస్పిటల్లో స్వప్న చికిత్స కోసం ఏర్పాట్లు చేయించారు.

Nandamuri Balakrishna helps Cancer patient girl, క్యాన్సర్‌ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పలకరింపు

Leave a Response