రిలీజ్ అయ్యేది ఆరోజే….

శరవేగంగా షూటింగ్ ని ముగిస్తున్నాడు మన మీల్క్ బాయ్ మహేశ్ బాబు. సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రొమోషన్స్ ని డిసెంబర్ నుంచి గ్రాండ్ గా మొదలుపెట్టనున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ని త్వరలో రిలీజ్ చేసి, ప్రొమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుందని చిత్ర యూనిట్ భావించడం విశేషం. టీజర్ డేట్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవలేదు కానీ టీజర్ జోష్ తగ్గేలోపు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేలా మహేశ్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్ ని కొత్త సంవత్సరం కానుకగా, డిసెంబర్ 31 మిడ్ నైట్ 12 తర్వాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. జనవరి 12న రిలీజ్ ఉంది కాబట్టి దానికి సరిగ్గా రెండు వరాల ముందు ట్రైలర్ ని రిలీజ్ చేస్తే బజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లోపు టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే ప్రొమోషన్స్ పర్ఫెక్ట్ స్వింగ్ లో ఉంటాయి.

Image result for mahesh

Leave a Response