హల్ చల్ అవుతున్న కంగనా ఫాస్ట్ లుక్…

పురచ్చితలైవి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఈ బయోపిక్ లో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగన జయలలిత రూపంలో విక్టరీ సింబల్ చూపిస్తోంది. కాగా, ఈ రియల్ లైఫ్ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయలలిత జీవితంలో నాటకీయ పరిణామాలకు కొదవలేకపోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Leave a Response