జనీలియా కుమారుని పుట్టినరోజు వేడుకలకు..

బాలీవుడ్ యాంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, జనీలియాలు తమ కుమారుని బర్త్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. జనీలియా, రితేష్‌ల కుమారుడు రియాన్ బర్త్ డే పార్టీకి ఐశ్వర్యారాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు వారి కుమార్తె ఆరాధ్యతో సహా హాజరయ్యారు. పార్టీలో ఐశ్వర్య ఎంతో హుషారుగా కనిపించారు. ఆమె బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించి కార్యక్రమానికి వచ్చారు. కాగా రితేష్ క్యాజువల్ డ్రెస్‌లో కనిపించారు. పార్టీకి షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పూత్ వచ్చారు. ఆమె తన కుమార్తె మీషాను తీసుకునివచ్చారు. ఈ బర్త్ డే వేడుకల సందర్భంగా రితేష్, జనీలియా ఎంతో ఉత్సాహంగా ఫొటోలకు ఫోజులిచ్చారు.

Leave a Response