టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు
. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈసినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంది. డిసెంబర్ నుండి ప్రమోషన్స్ ఊపు మరింత పెంచే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 5న చేయాలని యూనిట్ భావిస్తుందట. త్వరలోనే వేదికను కూడా ఖరారు చేస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు టైటిల్ ట్రాక్ మాత్రమే విడుదలైంది. మరి మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలోనే విడుదల కాబోతున్నాయట. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది.
