గోదావరి జిల్లాల్లోని శివపురం గ్రామంలో బంగార్రాజు (నాగార్జున) పిల్ల జమీందారు. ఆ సోగ్గాడి భార్య సత్యభామ (రమ్యకృష్ణ).ఆమె కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్‌లో బంగార్రాజు చనిపోతాడు. భర్తలానే పుట్టిన కొడుకు రాము (నాగార్జున) ను అతి జాగ్రత్తగా పెంచుతుంది సత్యభామ. రాము భార్య సీత (లావణ్యా త్రిపాఠీ). అమెరికాలో టాప్ ఫైవ్ డాక్టర్స్‌లో ఒకడిగా స్థిరపడ్డ రామూకి పనే లోకం. భార్య మీద ప్రేమను కూడా పైకి వ్యక్తం చేయలేని అమాయకుడు. దాంతో, విడాకులకు సిద్ధమై, సత్యభామకు చెప్పడం కోసం ఇండియాలోని ఊరికొస్తారు. వీటికన్నిటికీ మొగుడు బంగార్రాజు కారణమని తల్లి నిందిస్తుంది. అప్పుడు యముడి అనుమతితో తండ్రి ఆత్మ భూలోకానికి వస్తుంది. ఈ ఫ్రెండ్లీ ఘోస్ట్ ఇక్కడ భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఇల్లాంటి కథను మళ్ళీ అభిమానుల ముందుకు తెస్తున్నాడు ఈ సినిమా దర్శకుడు. అందువలన అదే టైటిల్ తో .. అదే దర్శకుడితో ఆయన సినిమా చేయడానికి రంగంలోకి దిగేశారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా నాగార్జున తన సినిమా చేసిన దర్శకులకు పారితోషికం ఇచ్చేస్తుంటారు. కానీ కల్యాణ్ కృష్ణకి మాత్రం పారితోషికం ఇవ్వకుండా, సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇస్తానని చెప్పారట. అందుకు కల్యాణ్ కృష్ణ కూడా అంగీకరించాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ మనవడిగా చైతూ కనిపించనున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం అభిమానుకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
previous article
oh baby ప్రీ రిలీజ్ ఈవెంట్..డేట్
next article
బిగ్ బాస్ 3 టీజర్…