టాలీవుడ్ లో వివాహం తర్వాత వరుసగా సినిమాలు అంగీకరిస్తూ విజయాలు అందుకుంటోంది మన అందాల సుధారి సమంత. ఇటీవల ఓ బేబీ
వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా విజయం అందుకుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం సమంత కొత్త సినిమాలు అంగీకరించడం లేదట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 96
రీమేక్ తప్ప ఆమె సంతకం చేసిన కొత్త సినిమా ఏదీ లేకపోవడం టాలీవుడ్ లో విశేషం. తల్లి కావాలని నిర్ణయించుకోవడం వల్లే సమంత కొత్త సినిమాలను అంగీకరించలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆమె సినిమాలు అంగీకరించకపోవడానికి అసలు కారణం అది కాదట. సమంత ప్రస్తుతం వెబ్‌సిరీస్ ఫ్యామిలీ మెన్
సీజన్-2లో నటిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత నెగిటివ్ క్యారెక్టర్ చేస్తోంది. తీవ్రవాది పాత్రలో కనిపించబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత పాత్ర చాలా ఎక్కువ సమయం ఉంటుందట. ఇక తన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.