బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హేమ తొలి వారంలోనే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు `బిగ్‌బాస్ 3` చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఫైనల్ విజేత ఎవరో తెలియనుంది. కాగా.. బిగ్‌బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపై ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో నటి హేమ సంచనల వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ షో ఎడిటరే బిగ్‌బాస్ అని వ్యాఖ్యానించిన హేమ, నిర్వాహకులు చెడును మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. ఫైనల్‌కు రావాలని మళ్లీ తనకు పిలుపు వచ్చినా.. వెళ్లి అవమానపడటం ఎందుకని ఆహ్వానాన్ని తిరస్కరించానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీముఖిపై హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీముఖి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతుందని తెలిపారు. ఆమె గేమ్ ప్లాన్‌లో అందరూ బలవుతున్నారని కూడా తెలిపారు. బిగ్‌బాస్ ఫైనల్‌కు ముందు హేమ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపనుందో వేచి చూడాలి.
previous article
రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వల్లభనేని..!