విజయ నిర్మల చివరి కోరిక మిగిలిపోయింది…?

విజయ నిర్మల ఎన్నో సినిమాలు తీశారు,ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా, నటిగా, దర్శకురాలిగా ఆమె తన ప్రతిభను చాలా బాగా నిరూపించుకున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలు  సినీ రంగ ప్రస్థానంలో చెరగని ముద్దలా నిలిచిపోయారు. ఆమె తన చివరి కోరిక తీరకుండానే చనిపోయారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలో మరో మహిళకు సాధ్యం కాని రికార్డును తన సొంతం చేసుకున్న ఆమె.. కనీసం 50 సినిమాలకు దర్శకత్వం వహించాలని అనుకున్నారట విజయ నిర్మల గారు. అయితే, ఆమె కల నెరవేరకుండానే ఈ లోకం నుండి తుదిశ్వాస విడిచారు ఆమె.

తెలుగులో ఎన్నో సినిమాలు తీశారు.ఆమె తెలుగులో తీసిన ఫాస్ట్ సినిమా హీరోయిన్ ‘మీనా’తో దర్శకత్వ రంగంలోకి  అడుగుపెట్టిన విజయ నిర్మల తెలుగు, తమిళ భాషల్లోలో  దర్శకత్వం వహించి ఎన్నో హిట్ చిత్రాలను అందించారు చిత్రపరిశ్రమకు. ‘దేవదాస్’ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఇక దర్శకత్వం నుంచి తప్పుకోవాలని భావించారట విజయ నిర్మల గారు. అయితే, జయాపజయాలు మామూలేనని కృష్ణ నచ్చజెప్పడంతో ఆమె దర్శకత్వాన్ని తిరిగి కొనసాగించారు. అయితే, 50 సినిమాలు చేయాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్ని సూపర్ స్టార్ కృష చెప్పుతూ కన్నీటి ప్రవంతం అయ్యారు.

Tags:krishananamrathanareshvijaya nirmala

Leave a Response