యంగ్ హీరో సందీప్ కిషన్ ఎన్నో సినిమాలో నటించాడు,తక్కువ టైం లో సినిమాలో ఎంతో పేరుతెచ్చుకున్నాడు మన హీరో. పెద్ద హీరోయిన్స్ తో కూడా నడిచాడు,రకుల్ ప్రీతిసింగ్,రాశికన్నా,మంచు లక్ష్మి,తాప్సి,రెజీనా కాసాండ్రా అలా ఎంతోమంది ముద్దుగుమ్మలతో నటించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని… తన జీవితంలో ఏ అమ్మాయి లేదని హీరో సందీప్ కిషన్ చెప్పాడు. రెండేళ్ల క్రితం వరకు ఒక అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నానని… ఆ తర్వాత కట్ అయిందని తెలిపాడు. ఆ అమ్మాయి పేరు చెప్పడం తప్పని… ప్రస్తుతం ఆమె జీవితాన్ని ఆమె గడుపుతోందని, తన జీవితాన్ని తాను గడుపుతున్నానని… ఆమె పేరు చెప్పలేనని అన్నాడు. విడిపోయిన వ్యక్తి గురించి చెప్పడం సబబు కాదని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ తనకు జరిగిన సంఘటనని మనకు వివరించాడు. హీరోయిన్ రెజీనాతో తనకు ఏదో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని… అవన్నీ పుకార్లు మాత్రమేనని సందీప్ కిషన్ తెలిపాడు. తామిద్దరం మంచి మిత్రులమని… ఈ ఉదయం కూడా ఫోన్ లో మాట్లాడుకున్నామని చెప్పాడు.