మూడు భాషలో నటిస్తుంది…

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది. ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడువైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది. సినిమాతోనే స్టార్‌డమ్‌ దక్కించుకునే అవకాశం అతి తక్కువ మందికి వస్తుంది. వారిలో సాయి పల్లవి ఒకరు. తెలుగు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె తమిళంలో నటించిన ‘ఎన్జీకే’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు. త్వరలో టాలీవడ్ యఞ్చ హీరో రానాకు జోడీగా ‘విరాటపర్వం’ సినిమాలో నటించడం విశేషం. వీరి సినిమా కోసం టాలీవుడ్ అంత ఎదురు చూస్తుంది.

Related image

Leave a Response