పడ్డేస్తాను….నాగ్…?

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున. తాను హీరోగా అభిమానుల ముందుకు వస్తున్న సినిమా మన్మథుడు-2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై కింగ్ నటిస్తున్న సినిమా, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. గురువారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు యూనిట్. నీకు షట్టర్లు మూసేసి దుకాణం సర్దేసే వయసొచ్చేసింది అంటూ సీనియర్ నటి దేవదర్శిని చెబుతున్న సంభాషణతో టీజర్ మొదలైంది. ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదంటూ అందరూ నాగార్జునను ఆటపట్టించడం చక్కటి వినోదాన్ని పంచింది. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్‌కు దిగుతున్నావ్ వంటి డైలాగ్‌లు వ్యంగ్యాస్ర్తాలతో అందరిని ఆక్కతుకుట్టన్నా యి . టీజర్‌లో నాగార్జున అందంగా కనిపించారు. చివరగా ఐ డోన్ట్ ఫాల్ ఇన్ లవ్..ఐ ఓన్లీ మేక్ లవ్ అని నాగార్జున చెప్పిన సంభాషణ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, కీర్తి సురేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సమంత కీలకమైన అతిథి పాత్రలో కనిపించనుంది. సింగిల్ షెడ్యూల్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం పేర్కొంది. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, సంగీతం: చైతన్య భరద్వాజ్, సంభాషణలు: కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.

Image result for nagarjuna manmadhudu 2

Leave a Response