వంశీ పైడిపల్లికి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘ఊపిరి’ ఒకటిగా కనిపిస్తుంది. నాగార్జున – కార్తీ నటించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళంలోను విడుదలై విజయాన్ని సాధించింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ‘ఊపిరి’ సినిమాను గురించి ప్రస్తావించారు.
‘ఊపిరి’ సినిమాలో కార్తీని తీసుకోవడానికి ముందు ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ను అనుకున్నాము. అయితే ఇటు నాగార్జున డేట్స్ .. అటు ఎన్టీఆర్ డేట్స్ కుదరలేదు. దాంతో నాగార్జునతో పాటు ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అనే ఆలోచన జరుగుతున్నప్పుడు కార్తీ పేరు ప్రస్తావన కొచ్చింది. అప్పుడు కార్తీని సంప్రదించడం జరిగింది. కార్తీ ఉండటం వలన ఈ సినిమాను తమిళంలోను విడుదల చేయగలిగాము” అని చెప్పుకొచ్చారు.