మాజీ ప్రియురాళ్లతో……

తన మాజీ ప్రియురాళ్లతో ఇప్పుడు స్నేహంగా ఉంటున్నట్లు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు. ప్రముఖ డ్యాన్స్‌ రియాల్టీ షో నాచ్‌ బలియే-9 ప్రీమియర్‌లో సల్లూభాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ షోలో దంపతులు, మాజీ దంపతులు కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. ఒకప్పటి దంపతులు ఊర్వశి ధోలాకియా, అనుజ్‌ సచ్‌దేవ్‌ కూడా షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశిస్తూ సల్మాన్‌ మాట్లాడారు. ‘ఒకప్పుడు మీరు ప్రేమించుకున్నారు. తర్వాత విడిపోయినప్పటికీ మళ్లీ ఈ షోలో కలిశారు. అది చాలా గొప్ప విషయం. జీవితం చాలా చిన్నది. తోటివారిని ద్వేషిస్తూ కూర్చుంటే ఎలా. నేను కూడా నా మాజీ ప్రియురాళ్లతో స్నేహంగా ఉంటున్నా, ఇప్పుడు వారికి నేను స్నేహితుడ్ని. అది ఎంతో అందమైన అనుభవం. ఎవరైనా సరే.. ఓసారి విడిపోయిన తర్వాత మళ్లీ కలుసుకోవాలి’ అని అన్నారు.సల్మాన్‌ ఇటీవల ‘భారత్‌’తో మంచి హిట్‌ అందుకున్నారు. అలీ అర్బాజ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.200 కోట్లకుపైగా రాబట్టింది. సల్మాన్‌ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ ఇందులో కథానాయికగా నటించారు. ప్రస్తుతం సల్లూభాయ్‌ ‘దబాంగ్‌ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా దర్శకుడు. సోనాక్షి సిన్హా కథానాయిక. అర్బాజ్‌ ఖాన్‌, ప్రమోద్‌ ఖన్నా, సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 20న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Response