అర్జున్‌రెడ్డి
సినిమాతో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతగోవిందం
సినిమాతో విజయ్ క్రేజ్ మరింత పెరిగిందన విషయం మన అందరికి తెలిసిందే. విజయ్ నటించిన డియర్ కామ్రేడ్
చిత్రాన్ని హిందీలోకి బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రీమేక్ చేతున్నారు. త్వరలో నేరుగా హిందీ సినిమా చేయాలనే ఆలోచనలో కూడా విజయ్ ఉన్నాడట. తాజాగా కరణ్ జోహార్ ముంబైలో నిర్వహించిన పార్టీకి విజయ్ హాజరయ్యాడు. అంతర్జాతీయ ప్రముఖ గాయని క్యాటీ పెర్రి ముంబై రాక సందర్భంగా కరణ్ ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారితో కలిసి విజయ్ సందడి చేశాడు. బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, దీపిక పదుకొనేతో కలిసి విజయ్ సందడి చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.