పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కెరీర్లో `తొలిప్రేమ` సినిమా మైల్స్టోన్ మూవీ. ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎ.కరుణాకరణ్ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఆయనకు యువతలో తిరుగులేని క్రేజ్‌ను తెచ్చి పెట్టిన చిత్రమిది. ఈ సినిమాలో సాంగ్స్ మంచి ఆదరణను పొందాయి. క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన ఈ సినిమాలో `ఈ మనసే… ` సాంగ్‌ను ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. `ఆటగదరా శివ` ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్యారాజేశ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `మిస్ మ్యాచ్`. నిర్మల్‌కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో `ఈ మనసే.. ` సాంగ్‌ను రీమేక్ చేశారట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ రీమేక్ సాంగ్‌ను సింగిల్ షాట్లో చిత్రీకరించారట. విజయ్ మాస్టర్ నేతృత్వంలో రెండు, మూడు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని నాలుగు నిమిషాల పాటు సాగే సాంగ్‌ను సింగిల్ షాట్లో చిత్రీకరించారట. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్ రెజ్లర్ పాత్రను పోషించింది.
previous article
ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా…
next article
నిఖిల్‌తో నివేథా థామస్…
Related Posts
- /No Comment
అమెరికాలో పవన్ కల్యాణ్ సభ హోరెత్తింది….
- /No Comment