రాధికా ఆప్టే బండారం బయటపెట్టేసింది

రాధికా ఆప్టే మనకు ‘లయన్, లెజెండ్’ లాంటి సినిమాల ద్వారా బాగా పరిచయమే. అయితే, ‘రక్త చరిత్ర’ సినిమాలో తన టాలెంట్ ఏంటో చూపిన ఈ బీ-టౌన్ బ్యూటీ హిందీలో చాలా సినిమాలే చేసింది. వెబ్ సిరీస్‌లలో కూడా బోల్డ్‌గా నటిస్తుంటుంది. కాకపోతే, తెర మీద ఎంత బోల్డ్‌గా ఉంటుందో అంతే డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది రియల్ లైఫ్లో కూడా! ఇప్పుడు రాధికా అలా చేసిన ఓ స్ట్రయిట్ ఫార్వర్డ్ స్టేట్మెంటే విక్కీ కౌశల్ కొంప ముంచింది! కెరీర్ మొదట్నుంచీ దమ్మున్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు విక్కీ కౌశల్. ముఖ్యంగా, ‘యురి’ సినిమా భారీ విజయం తరువాత విక్కీ స్టార్ స్టేటస్ స్వంతం చేసుకున్నాడు. మరి స్టార్‌డమ్ అంటూ వచ్చాక ఎఫైర్లు అగుతాయా? అవి కూడా వచ్చేశాయి. గాసిప్స్ మొదలైపోయాయి. అయితే, మీడియా విక్కీ కౌశల్ గాళ్‌ఫ్రెండ్ అంటూ ఎవరి పేరూ బలంగా చెప్పలేదు కానీ… రాధికా ఆప్టే మనోడి బండారం బయటపెట్టేసింది! విక్కీ కౌశల్‌ని మోహంలో పడేసింది. మాళవికా మోహనన్ అంటూ బాంబు పేల్చింది! మలయాళంలో మూడు, కన్నడలో ఒక సినిమా చేసిన మాళవిక… తమిళంలో రజనీకాంత్ పేట చిత్రంలో కనిపించింది. త్వరలో మన విజయ్ దేవరకొండ సరసన హీరో సినిమాలోనూ మెరవబోతోంది. అయితే, సౌత్ మీద బాగా ధ్యాస పెట్టిన మాళవిక మోహనన్ హిందీ హీరోకి మనసిచ్చేసింది. విక్కీ కౌశల్‌తో ఈమె వ్యవహారం నడుపుతోందని రాధికా ఆప్టే కుండ బద్ధలు కొట్టేసింది. విక్కీ, మాళవిక చాలా నెలలుగా సాయంత్రం వేళ క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఎంజాయ్ చేస్తున్నారని వివరించిన రాధికా తనకు సీక్రెట్ ఎలా తెలిసిపోయిందో కూడా చెప్పింది. రాధికా తమ్ముడు విక్కీ కౌశల్ ఫ్రెండట. అతడి ద్వారా అన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయట. అయితే, విక్కీ, మాళవిక ప్రేమ కథని లీక్ చేసిన ఆప్టే… వారికో ఫ్రీ అడ్వైజ్ కూడా ఇచ్చింది. ఇప్పటికైనా చాటుమాటు డేటింగ్ మానేసి… పబ్లిగ్గా ప్రకటించేయమని అంటోంది. మరి… విక్కీ కౌశల్ తన ఎఫైర్ పై ఏమంటాడు? మాళవిక రియాక్షన్… రాధికా పట్ల ఎలా ఉంటుందన్నది చూడాలి.

Leave a Response