తెలుగు, తమిళ ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మఅంజలి. ఈ అమ్మడు ఇప్పుడు `నిశ్శబ్దం` చిత్రంలో కీలక పాత్రలోనటిస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అమెరికా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న `నిశ్శబ్దం` చిత్రంలో అంజలి సీటెల్కు చెందిన పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుందట. ఈ పాత్ర కోసం బరువు తగ్గిన ఈ అమ్మడు సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా బిహేశ్ చేస్తారనే అంశాన్ని కూడా పరిశీలించి పాత్రలో నటించిందట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మాధవన్, షాలినిపాండే, సుబ్బరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
previous article
నవంబర్ 1న ఆవిర్భావ దినోత్సవం కేవలం లాంఛనమే.
next article
కోర్ కమిటీ భేటీలో రేవంతే టార్గెట్…
Related Posts
- /No Comment
పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
- /No Comment