నాగార్జున వడిలో కీర్తి సురేష్…

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమా మన్మధుడు 2 . ఈ సినిమాలో కింగ్ నాగార్జున, సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అభిమానుల ముందకు వస్తుంది. ఈ చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్నారు. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Image result for nagarjuna and keerthi suresh

అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగే కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుందని మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ హీరోయిన్ స్థానంలో చాలా పేర్లు కూడా హల్ చల్ అయ్యాయి. ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగిన ఆ హీరోయిన్ ఎవరో తెలియజేస్తూ చిత్రయూనిట్ లొకేషన్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఆ మన్మథుడితో నటిస్తున్న మరో హీరోయిన్ ఎవరనుకున్నారు. ఇంకెవరు.. ‘మహానటి’. ఇటీవల వచ్చిన ‘మహానటి’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న కీర్తిసురేష్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. మన్మథుడు నాగార్జున ఒడిలో మహానటి కీర్తిసురేష్ ఉన్న ఫొటోతో పాటు చిత్రంలోని కీర్తిసురేష్ సోలో స్టిల్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Leave a Response