తిరుపతి పరిసరాల్లో ‘శ్రీకారం’

ట్యాన్గ్ హీరో శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ అనే సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కిషోర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. జూన్ లో పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ సినిమా, అప్పటి నుంచి చకచకా షూటింగు జరుపుకుంటూ వెళుతోంది. తాజా షెడ్యూల్ ను ‘తిరుపతి’ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు దర్శకుడు. తిరుపతికి సమీపంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది.14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట – గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించాడు.

Leave a Response