టాలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు, ఆయనతో ‘భారతీయుడు 2’ను కూడా నిర్మించడానికి రంగంలోకి దిగారు. అయితే, తొలి షెడ్యూల్ షూటింగులోనే ఆ షెడ్యూల్ బడ్జెట్ కి మించి శంకర్ ఖర్చు చేయించాడట. దాంతో నిర్మాతలు సినిమా మొత్తానికి బడ్జెట్ వేసి, ఎలాంటి పరిస్థితుల్లోనూ అది దాటకూడదని చెప్పారట.
ఒకవేళ ఆ బడ్జెట్ దాటితే శంకర్ కి ఇచ్చే పారితోషికం నుంచి కట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఆ పారితోషికాన్ని మించి కూడా ఖర్చు చేస్తే, అది శంకర్ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. అలా అగ్రిమెంట్ తయారు చేయించడంతో శంకర్ ఆలోచనలో పడ్డాడట. మరో నిర్మాణ సంస్థని రంగంలోకి దింపడానికి ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో శంకర్ ఆ అగ్రిమెంట్ పై సంతకం చేశాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.