టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్
. ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా అభిమానుల ముందుకు వస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమాకి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.