జ్వరంతో బాధపడుతున్న దీపిక…

బాలీవుడ్ అందాల సుందరి… స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తన అభిమానులకు తెలియజేసింది. బెంగళూరులో తన స్నేహితురాలు ఊర్వశి కేశ్వానీ పెళ్లికి తన భర్త రణవీర్ సింగ్, సోదరి అనీషా పదుకునేతో కలసి దీపికా వెళ్లింది. మెహందీ ఫంక్షన్ నుంచి పెళ్లి ముగిసేంత వరకు దీపిక అక్కడే గడిపింది. ప్రస్తుతం ఆమె జ్వరంతో బాధపడుతోంది. దీనికి సంబంధించి నోట్లో థర్మామీటర్ పెట్టుకున్నట్టు ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ‘నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో ఫుల్ ఎంజాయ్ చేసినప్పుడు’ అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది.

Leave a Response