మెగాస్టార్ హీరోతో రమ్యకృష్ణ…

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్… ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ, ప్రస్తుతం కీలకమైన పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువ హీరోలకి తల్లిగా .. అత్తగా పవర్ఫుల్ పాత్రలను చేస్తూ టాలీవుడ్ లో అందరిని మెప్పిస్తున్నారు. ‘రొమాంటిక్’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్న ఆమె, త్వరలో మెగా హీరో షూటింగులో పాల్గొనే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.వరుణ్ తేజ్ హీరోగా సెట్స్ పైకి వెళ్లనున్న ఒక సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ తో ఒక వైపున కిరణ్ కొర్రపాటి .. మరో వైపున సురేందర్ రెడ్డి సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఎవరి ప్రాజెక్టు కోసం రమ్యకృష్ణను అడుగుతున్నారనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఇప్పటి వరకూ అక్కినేని వారసులతో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రమ్యకృష్ణ, మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టడం టాలీవుడ్ లో విశేషంగా మారింది.

Image result for ramya krishna

Leave a Response