పెళ్లి సందడిలో మునిగ్గిపోయినా అర్చన…

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ అర్చన, పారిశ్రామికవేత్త జగదీశ్ వివాహం రేపు తెల్లవారుజామున 1:30 గంటలకు వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి జరగనున్న గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం విశేషం. శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా వారితో కాలు కదిపారు. కాగా, నేడు రిసెప్షన్ జరగనుంది. సంగీత్ కార్యక్రమానికి వధూవరుల తల్లిదండ్రులతోపాటు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.

Leave a Response