చిరూ పుట్టిన రోజునే కొరటాల ప్రాజెక్టు పట్టాలపైకి…

టాలీవుడ్ హీరో చిరంజీవి ‘సైరా’ సినిమా షూటింగును పూర్తిచేసే పనిలో వున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, చిరు సరసన నాయికగా నయనతార నటిస్తోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

Image result for chiranjivi and koratala srinivas

ఈ సినిమా తరువాత చిరంజీవి .. కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయాలనే ఆలోచనలో కొరటాల శివ వున్నారు. సినిమా లాంచ్ తరువాత ఒకటి రెండు రోజుల గ్యాప్ తీసుకుని, రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. సామాజికపరమైన కథాంశంతో .. సందేశంతో ఈ సినిమా వుంటుందని అంటున్నారు. ఎన్నారైగాను .. రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారని చెబుతున్నారు.

Tags:August 22BirthdayKoratala SivaNayanthara

Leave a Response