రానా కొత్త సినిమా….

టాలీవుడ్ యాంగ్ హీరో రానా కథానాయకుడిగా తాను ‘హిరణ్యకశిప’ సినిమా చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. దాంతో ఈ సినిమా ఎంత బడ్జెట్ లో నిర్మితం కానుందనేది ఆసక్తికరంగా మారింది.

Related image

ఈ సినిమా 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితం కానున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది. ఈ కారణంగానే సురేశ్ బాబుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు బడా నిర్మాతలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు.

Leave a Response