తనకు కాబోయే భర్త రొమాంటిక్‌గా ఉండాలని కథానాయిక రష్మిక అంటున్నారు. ఆమె నటిస్తున్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడు. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని విలేకరి ప్రశ్నించారు. దీనికి కన్నడ భామ స్పందిస్తూ.. ‘అతడు తన భావాల్ని, ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తైనా, కాకపోయినా ఫర్వాలేదు. కానీ నిజాయతీగా ఉండాలి. అతడి ప్రవర్తన నాకు నచ్చాలి. అన్నింటికన్నా మించి అతడిది మంచి మనస్సై ఉండాలి. అతడితో చాలా సమయం గడపాలని నాకు అనిపించాలి. నా దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేదు’ అని పేర్కొన్నారు.రష్మిక తన సహ నటుడు రక్షిత్ శెట్టిని 2017లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కొన్ని కారణాల వల్ల రష్మిక, రక్షిత్ విడిపోయి, 2018 సెప్టెంబరులో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అయితే రష్మిక ఎంచుకుంటున్న కథలు రక్షిత్‌కు నచ్చలేదని, ఆమె సహనటులతో స్నేహంగా ఉండటం ఆయనకు నచ్చని కారణంగా విడిపోయినట్లు వదంతులు వచ్చాయి. కానీ వీటిలో నిజం లేదని రష్మిక స్పష్టం చేశారు.
previous article
ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్….
next article
పాయల్ రాజ్పుత్ ప్రేమలో పడ్డారా…..