టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్
సినిమా చేస్తోన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ తనకు అరవింద సమేత వీర రాఘవ
సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్‌తోనే సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఆర్ఆర్ఆర్
తర్వాత వచ్చే క్రేజ్ మరో రేంజ్లో ఉంటుందనడంలో సందేహం లేదు. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయాలంటే ఓ మంచి దర్శకుడు కచ్చితంగా అవసరం కాబట్టి త్రివిక్రమ్‌తో చేస్తే బావుంటుందని భావిస్తున్నారని టాలీవుడ్ సమాచారం.