టాలీవుడ్ లో జానపథ నేపథ్యంలో వచ్చేసినిమాల్లో హీరోయిన్గా టాలీవుడ్ అందాల సుందరి అనుష్కనే తీసుకోవాలని ఇటీవలి కాలంలో దర్శకులు నిర్ణయించారు. అయితే ఇకపై అలాంటి భారీ సినిమాలు చేయలేనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుష్క స్పష్టం చేసింది. అలాంటి సినిమాలు చేసి బాగా అలసి పోయానని వెల్లడించింది.చారిత్రక సినిమాలు చేసే ఓపిక నాకు ఇక లేదు. అలాంటి సినిమాల కోసం చాలా కష్టపడాలి. చాలా సమయం వెచ్చించాలి. మేకప్ కోసం కూడా చాలా సమయం కేటాయించాలి. కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలి. ఇక నాకు ఓపిక అయిపోయింది. నేను అలసిపోయాను. అందుకే ఇకపై అలాంటి సినిమాల్లో నటించాలని అనుకోవడం లేద
ని అనుష్క చెప్పింది. ఈ కారణంతోనే మణిరత్నం రూపొందిస్తున్న భారీ చారిత్రాత్మక సినిమా పొన్నియన్ సెల్వన్
కు అనుష్క నో
చెప్పడం టాలీవుడ్ లో విశేషంగా మారింది.