‘భాగమతి’ హిట్ తర్వాత అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్ధం’. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. స్వీటీ చిత్ర పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆమెకు యూనిట్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్లో అనుష్క చేతులు మాత్రమే చూపించారు. ఇందులో ఆమె దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.ఈ చిత్రానికి మంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ కూడా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో తన లుక్‌ను తెలుపుతూ అనుష్క ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.
previous article
ఇది నిజంగా నాకు సర్ప్రైజ్…..
next article
మాజీ ప్రియురాళ్లతో……